రాజధానిలో వరదనీటి ప్రాంతాలను గుర్తించండి

11 Mar, 2016 14:58 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధానిలో వరద నీటి ప్రాంతాలను గుర్తించాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. నదీ తీరంలో పర్యావరణానికి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ కేసులో ఏప్రిల్ 4న తుది వాదనలను విననుంది.

రాజధానిపై గ్రీన్ ట్రిబ్యునల్లో పోరాడేందుకు విరాళాలు కావాలని పిటిషనర్ శ్రీమన్నారాయణ ఫేస్బుక్లో పోస్ట్ చేసినందుకు డిబార్ చేయాలని ఏపీ ప్రభుత్వం కోరింది. ఏపీ ప్రభుత్వం అభ్యర్థనను గ్రీన్ ట్రిబ్యునల్ తిరస్కరించింది. న్యాయపోరాటం చేసే హక్కును హరించలేమని పేర్కొంది. కాగా క్షమాపణలు చెప్పాలని ట్రిబ్యునల్ శ్రీమన్నారాయణను ఆదేశించింది. ట్రిబ్యునల్ ఆదేశంతో ఆయన క్షమాపణలు చెప్పారు.

మరిన్ని వార్తలు