గురుపౌర్ణమి గురించి మాట్లాడిన నాసా

8 Jul, 2017 19:29 IST|Sakshi
గురుపౌర్ణమి గురించి మాట్లాడిన నాసా

న్యూఢిల్లీ: 'గురు పౌర్ణమి' వేడుకలను భారత్‌లో ఘనంగా జరుపుకుంటారన్న విషయం తెలిసిందే. ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమినాడు ఈ వేడుకలు నిర్వహిస్తారు. గురుపౌర్ణమి గురించి సోషల్‌ మీడియాలో కూడా చర్చ నడుస్తోంది. అయితే ఈ చర్చలోకి ఓ అరుదైన అతిథి 'నాసా' వచ్చి చేరింది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా మనం జరుపుకునే గురుపౌర్ణమి గురించి తన ట్వీటర్‌ ఖాతాలో పేర్కొంది.

నిండు చంద్రుడిని పలు ప్రాంతాల్లో ఏమని పిలుస్తారో వివరించింది నాసా. అందులో 'గురు పౌర్ణమి', 'హే మూన్', 'మీడ్‌ మూన్', 'రైప్‌ కార్న్‌ మూన్', 'బక్‌ మూన్‌', 'థండర్‌ మూన్‌' అనే పేర్లు ఉన్నాయి. వివిధ ప్రాంతాల్లో పున్నమి చంద్రుడిని పిలుచుకునే పేర్లతో పాటు గురు పౌర్ణమి నాడు తీసిన ఓ అద్భుతమైన చంద్రుని ఫొటోని ట్వీటర్‌లో షేర్‌ చేసింది నాసా. దీంతో భారత్‌లో జరుపుకునే గురు పౌర్ణమిని గుర్తించినందుకు పలువురు భారతీయులు నాసాకు కృతజ్ఞతలు తెలుపుతూ రీట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు