పామును ప‌ట్టుకోండి..

28 Jun, 2020 16:24 IST|Sakshi

ప‌జిల్స్‌.. మెద‌డుకు మేత. అప్పుడ‌ప్పుడు ఈ ప‌జిల్స్‌ను సాల్వ్ చేస్తుంటే కాల‌యాప‌న‌తో పాటు మెద‌డుకు ఎక్స‌ర్‌సైజ్ కూడా అవుతుంది. ఇంత‌కు ముందు గ‌జిబిజిగా ఉన్న ఫొటో పిల్లిని, జ‌న స‌మూహం మ‌ధ్య‌లో మాస్కు ధ‌రించిన వ్య‌క్తిని గుర్తుపట్టారు క‌దా! ఈసారి పై ఫొటోలో పాము ఎక్క‌డ ఉందో పసిగ‌ట్టండి. ఇంత‌కీ ఏ పాము? అంటూ ప్ర‌శ్న‌లు మాని బుర్ర‌కు ప‌దును పెట్టండి, చూపులో తీక్ష‌ణ‌త పెంచండి. సాధార‌ణ చెట్లు, క‌ల‌ప, నిర్మానుష్య‌మైన భూమి ఉన్న ఈ ఫొటోలో పామును క‌నుక్కోండి.. అంటూ ఈ ప‌జిల్‌ ప్ర‌స్తుతం ఫేస్‌బుక్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది. (దయచేసి దీన్ని ఇంట్లో ప్రయత్నించకండి)

ఇక‌‌ ఇది ఇంటి వెనుక ఖాళీ స్థ‌లంలా గోచ‌రిస్తోంది. ఇలాంటి ప్ర‌దేశాలే క‌దా పాముల‌కు అనువైన‌వి. కాబ‌ట్టి అది ఎవ‌రికీ క‌న‌బ‌డ‌కుండా ఎక్క‌డ న‌క్కి ఉందో తోక ప‌ట్టుకుని లాగేయండి. ఓస్ ఇదెంత ప‌ని? అంటూ కొంద‌రు దాని ఆచూకీ గుర్తుప‌ట్టి ఫొటోలు షేర్ చేస్తున్నారు. మ‌రికొంద‌రు మాత్రం ఎందెందు వెతికినా.. అందందు పాము లేదయా అని ఉసూరుమంటున్నారు. మీరూ ఈ జాబితాలో ఉంటే ఇక శ్ర‌మించడం మాని కింద ఉన్న ఫొటోను చూసేయండి. పాము పారిపోకుండా ప‌ట్టేసుకోండి.. (ఇందులో పిల్లి ఎక్కడుందిరా బాబూ?)

Poll
Loading...
మరిన్ని వార్తలు