ఢిల్లీ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం

18 Nov, 2016 07:39 IST|Sakshi
ఢిల్లీ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం

ఢిల్లీ: స్థానిక ముంద్కా ప్రాంతంలోని మార్కెట్లో శుక్రవారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. దుకాణాల నుంచి మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. మంటలను గమనించిన స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న వెంటనే 33 ఫైరింజన్లతో సిబ్బంది అక్కడి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. భారీగా ఆస్తినష్టం సంభవించి ఉంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు