ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం

26 Apr, 2016 06:44 IST|Sakshi
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం

ఢిల్లీ: వరుస అగ్ని ప్రమాదాలు దేశ రాజధాని ఢిల్లీను బెంబేలెత్తిస్తున్నాయి. ఢిల్లీలోని టీవీ టవర్ సమీపంలో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదం మరువక ముందే మరో అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున ఫిక్కీ ఆడిటోరియంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆడిటోరియంలోని పై అంతస్తులోని మ్యూజియంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

కొద్ది నిమిషాల వ్యవధిలోనే బిల్డింగ్ మొత్తానికి మంటలు వ్యాపించాయి. అగ్నికీలలు భారీగా ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు రంగంలోకి దిగారు. 40 ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఐదుగురు ఫైర్ సిబ్బందికు గాయాలైనట్లు తెలుస్తుంది. ఆడిటోరియంలోని నేషనల్ మ్యూజియం పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదానికి కల కారణాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు