అంబానీ ఇంట్లో అగ్ని ప్రమాదం

11 Jul, 2017 01:19 IST|Sakshi
అంబానీ ఇంట్లో అగ్ని ప్రమాదం
ముంబై: ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్‌ సంస్థ అధినేత ముఖేశ్‌ అంబానీ ఇంట్లో సోమవారం అగ్ని ప్రమాదం సంభవించింది.

ముంబైలోని అల్టామౌంట్‌ రోడ్డులో ఉన్న ‘అంటీలియా’లో మంటలు చెలరేగినట్లు పోలీసులు తెలిపారు.

భవనంలోని తొమ్మిదో అంతస్తు టెర్రస్‌పై మంటలు ప్రారంభమై.. సమీపంలోని 4జీ సెల్‌ టవర్‌కు వ్యాపించినట్లు చెప్పారు. 6 ఫైరింజన్లు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయన్నారు.