భారీ అగ్ని ప్రమాదం..!

16 Sep, 2018 10:29 IST|Sakshi

కోల్‌క​త్తా : పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కత్తాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని కన్నింగ్‌ వీధిలో ఉన్న బంగారీ మార్కెట్‌లో గల ఓ భవనంలో  ఆదివారం ఈ ప్రమాదం సంభవించింది. భారీగా అగ్నికిలల ఎగసిపడుతుండంతో 30కి పైగా ఫైర్‌ ఇంజన్లు మంటలను అదుపుచేయడానికి ప్రయత్నిస్తున్నాయి. భారీగా ఎగసిపడుతున్న మంటలు పక్క భవనాలకు వ్యాపించే ప్రమాదం ఉన్నందున ఎన్డీఆర్‌ఎఫ్‌ బలగాలను రంగంలోకి దింపినట్లు నగర మేయర్‌ సోవన్‌ ఛటర్జీ తెలిపారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగిందని.. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని మేయర్‌ ప్రకటించారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు