దేశంలో తొలి మహిళా ఇమామ్‌!

28 Jan, 2018 04:38 IST|Sakshi
మహిళ ఇమామ్‌ జమిథా

మలప్పురం: ఇటీవల దళితుల్ని ఆలయాల్లో పూజారులుగా నియమించిన కేరళలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. దేశచరిత్రలోనే తొలిసారిగా ఓ మహిళ శుక్రవారం ప్రార్థనల(జుమ్మా నమాజ్‌)కు ఇమామ్‌గా వ్యవహరించింది. మలప్పురంలోని ఖురాన్‌ సున్నత్‌ సొసైటీ కార్యదర్శి జమిథా(34) తమ సంస్థ కార్యాలయంలో శుక్రవారం నమాజ్‌కు నేతృత్వం వహించారు. ఈ ప్రార్థనలకు పలువురు మహిళలు సహా 80 మంది హాజరయ్యారు. ఈ విషయమై జమిథా స్పందిస్తూ.. పవిత్ర ఖురాన్‌ పురుషులు, స్త్రీల మధ్య ఎలాంటి వివక్ష చూపదని చెప్పారు. మహిళలు ఇమామ్‌ కాకూడదని ఖురాన్‌లో ఎక్కడా లేదని వెల్లడించారు. 

మరిన్ని వార్తలు