బరంపురానికి పచ్చదనంలో మొదటి స్థానం

3 Aug, 2018 12:36 IST|Sakshi
మాట్లాడుతున్న సీనియర్‌ జర్నలిస్ట్‌ సుదీప్‌ సాహు, ప్రకాశ్‌ పండా, రంజన్‌ పాఢి, శక్తిధర్‌ తదితరులు 

బరంపురం : దక్షిణ ఒడిశాలో అన్ని రంగాల్లో మొదటి స్థానం పొందిన బరంపురం నగరం పచ్చదనంలో కూడా మొదటి స్థానం పొందేవిధంగా అందరు కలిసి కట్టుగా కృషి చేయాలని పలువురు వక్తలు ఆకాంక్షించారు.  గురువారం స్థానిక హిల్‌పట్నాలో గల ఎంఈవీ పాఠశాల ప్రాంగణంలో పాఠశాల యాజమన్యం ఆధ్వర్యంలో క్లీన్‌ బరంపురం.. గ్రీన్‌ బరంపురం చైతన్య ర్యాలీ, మొక్కల పెంపకం కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పాఠశాల ప్రిన్సి పాల్‌ ప్రకాష్‌ చంద్ర పండా  ఎన్‌సీసీ, స్కౌ ట్స్, గైడ్స్, విద్యార్థుల చైతన్య ర్యాలీని ప్రారంభిం చారు. అనంతరం అయన మాట్లాడుతూ నగరంలో పరిశుభ్రత, మొక్కల పెంపకంతో  పచ్చదనంతో పాటు పర్యావరణం పొందగలమని చెప్పారు. ఈ నేపథ్యంలో మనం ఉండే పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలని సూచిం చారు.

కార్యక్రమంలో కార్యదర్శి కుమార్‌ రంజన్‌ పాఢి, ప్రముఖ జర్నలిస్టులు శక్తిధర్‌ రాజ్‌గురు, సుదీప్‌కుమార్‌ సాహు పాల్గొని ప్రసంగించి పిల్లలను ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో వందలాది మంది ఎన్‌సీసీ, సౌట్స్,  గైడ్స్‌ పిల్లలు పాల్గొన్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు