వ్యక్తిగత సమాచారాన్ని ఎందుకు సేకరించారు?

22 Mar, 2018 03:06 IST|Sakshi

న్యూఢిల్లీ: పౌరుల్ని గుర్తించడానికి ఆధార్‌ పథకాన్ని తీసుకొచ్చినప్పుడు వారి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి క్రోడీకరించాల్సిన అవసరం ఏమొచ్చిందని సీజేఐ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ ఏకే సిక్రీ, జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ల రాజ్యాంగ ధర్మాసనం కేంద్రాన్ని ప్రశ్నించింది. సింగపూర్‌లో ప్రతి పౌరుడు చిప్‌ ఆధారిత గుర్తింపు కార్డును కలిగిఉంటాడనీ, ఈ పద్ధతిలో పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని ప్రభుత్వం సేకరించదని సుప్రీం వ్యాఖ్యానించింది.

దీంతో ఆధార్‌పై నెలకొన్న భయాందోళనల్ని తొలగించడానికి వీలుగా న్యాయస్థానంలో పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చేందుకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ సీఈవో అజయ్‌ భూషణ్‌ పాండేను అనుమతించాలని అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ విజ్ఞప్తి చేశారు.  గోప్యత హక్కు కంటే పేదప్రజలు గౌరవంగా బతకడమే ముఖ్యమన్నారు. దీంతో రాజ్యాంగ ధర్మాసనం స్పందిస్తూ.. పేదవారు కూడా గోప్యత హక్కును కలిగిఉంటారనీ, వాటిని ప్రభుత్వం ఉల్లంఘించలేదని స్పష్టం చేసింది. 

>
మరిన్ని వార్తలు