విజయవాడలో యూఐడీఏఐ తొలి ఆధార్‌ సేవా కేంద్రం

3 Jul, 2019 10:52 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) నిర్వహణలో ఆధార్‌ సేవా కేంద్రాలు మొదటిసారిగా ఢిల్లీ, విజయవాడలలో మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది చివరినాటికి దేశవ్యాప్తంగా మరో 53 నగరాల్లో 114 కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం అంచనా వ్యయం రూ.300–400 కోట్లుగా ప్రభుత్వం వెల్లడించింది. ఢిల్లీలో అక్షరధామ్‌ మెట్రో స్టేషన్‌ ప్రాంగణంలో ఏర్పాటైన సేవా కేంద్రం రోజుకు 1,000 నమోదు/నవీకరణ అభ్యర్థనలను పూర్తిచేయనుండగా.. విజయవాడ కేంద్రం 500 వరకు అభ్యర్థనలను పూర్తిచేయనుంది.  

మరిన్ని వార్తలు