ఐదుగురికి ఎబోలా పాజిటివ్‌లతో సంబంధాలు

21 Aug, 2014 02:13 IST|Sakshi
ఐదుగురికి ఎబోలా పాజిటివ్‌లతో సంబంధాలు

న్యూఢిల్లీ/మన్రోవియా/అబూజా: భయానకమైన ఎబోలా వైరస్ బాధిత దేశాలనుంచి గత 24గంటల్లో వివిధ విమానాశ్రయాల ద్వారా భారత్‌చేరుకున్న 145మందిలో ఐదుగురికి ఎబోలా వైరస్ పాజిటివ్ రోగులతో సంబంధం ఉన్నట్టుగా పరీక్షల్లో తేలింది. ఈ ఐదుగురు ప్రయాణికుల వివరాలను తదుపరి చర్యల కోసం వ్యాధి నిఘా పరీక్షలకు పంపినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

ఎబోలా బాధిత దేశాలనుంచి గత 24 గంటల్లో ముంబై విమానాశ్రయంలో 49మంది, ఢిల్లీలో 53మంది, చెన్నైలో 12మంది, కోచిలో 11మంది, బెగళూరులో 14మంది, అహ్మదాబాద్‌లో ఆరుగురు దిగినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎబోలా తీవ్రతను దృష్టిలో పెట్టుకుని లైబీరియాలో ఎబోలా  కర్ఫ్యూ విధించారు. మరో వైపు నైజీరీయాలో ఎబోలా వైరస్ సోకిన రోగికి చికిత్స అందించిన ఒక డాక్టర్ మరణించినట్టు అధికారులు ప్రకటించారు.
 

మరిన్ని వార్తలు