ఇంటాయనలు వండేస్తారట.. కాసుకోండి!

16 Feb, 2015 19:28 IST|Sakshi
ఇంటాయనలు వండేస్తారట.. కాసుకోండి!

ముంబై:అవకాశం రావాలే గానీ.. మగువల కంటే మగాళ్లే చక్కగా వండి వడ్డిస్తారన్నది సత్యం. పెద్ద పెద్ద హోటళ్లలో అయితే వీళ్లను గౌరవంగా 'చెఫ్' అని పిలుస్తారు. అదే ఇంట్లో అయితే.. 'వంటాయన' అనే చిన్న బిరుదు తగిలిస్తారు. ఇలాంటి ఇంటి వంటాయనలంతా కలిసి ఒక్కచోట చేరి తమ ఘుమఘుమలు రుచి చూపిస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ముంబైలో ఇలాంటి కార్యక్రమమే జరగనుంది. సింధీ, గుజరాతీ, ఈస్ట్ ఇండియా, మహారాష్ట్ర, ఉత్తరభారత ఒక్కటేమిటి దాదాపు 20 ప్రాంతాల నుంచి ఇంటి రుచుల కార్యక్రమంలో ఆయా ప్రాంతాలకు చెందిన వండివార్చేవారు పాల్గొంటారు. ఇందులో పురుషులు, మహిళలు కూడా పాల్గొనవచ్చు.

గుర్గావ్లోని వెస్టిన్ ముంబైగార్డెన్ సిటీలో ప్రముఖ వంటల రచయిత మినీ రిబైరో దీనిని ఆదివారం నిర్వహిస్తున్నారు. ఇదో రకమైన వంటల మేళాలాంటిది. మాములుగా ఇళ్లలో వంటలు చేసేవారితోపాటు వంటను తమ అభిరుచిగా ఎంచుకున్న వారంతా ఈ కార్యక్రమంలో తమ సత్తాను ప్రదర్శించవచ్చు. అదిరిపోయే రుచులతో కూడిన ఆహార పదార్థలతో వచ్చిన వారికి ది బెస్ట్ హోం చెఫ్గా అవార్డు కూడా ఇవ్వబోతున్నారు. ఈ అవార్డును ఫిలిప్స్ ఇండియా అందిస్తుండగా.. మాస్టర్ చెఫ్ అజయ్ చోప్రా న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. దేశంలో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం ఆరంభం మాత్రమేనని, టాలెంట్ ఉన్నవారిని వెలుగులోకి తీసుకురావడంతో పాటు, వంటలు చేయడంలో మెళకువలు నేర్పించాలనే ఉద్దేశంతో దీనిని నిర్వహిస్తున్నామని మినీరిబైరో తెలిపారు.

మరిన్ని వార్తలు