విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం

12 Oct, 2015 16:28 IST|Sakshi

చెన్నై: షార్జా నుండి కోయంబత్తూరు వస్తున్న ఎయిర్ అరేబియా  విమానానికి సోమవారం తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది.  పైలెట్ అప్రమత్తతో వ్యవహరించటంతో ప్రయాణీకులందరూ సురక్షితంగా బయటపడ్డారు.  కోయంబత్తూర్ అంతర్జాతీయ విమానాశ్రయలో ఈరోజు తెల్లవారుఝామున ఈ ఘటన చోసుకుంది.


వంద మంది ప్రయాణీకులతో షార్జా నుంచి వస్తున్న విమానానికి  అకస్మాత్తుగా ఓ పక్షి  అడ్డుగా వచ్చింది. విమానానికి బలంగా వచ్చి తాకింది. ఒక్కసారి విమానం కుదుపుకు గురవటంతో... అప్రమత్తమైన పైలట్ చాకచ్యంగా  విమానాన్ని కిందికి దించారు. దీంతో ప్రయాణీకులందరూ  ఊపిరి పీల్చుకున్నారు. లేదంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని ఆందోళన వ్యక్తం చేశారు.


మరోవైపు  మరమ్మత్తు కార్యక్రమాల తరువాత విమానం తిరిగి షార్జాకు బయలుదేరుతుందని అధికారులు తెలిపారు.  షార్జా వెళ్లడానికి  ఎదురు చూస్తున్న  సుమారు 160 మంది ప్రయాణికులకు  ఎయిర్  పోర్టు అధికారులు...  హోటళ్లలో  తగిన  ఏర్పాట్లు  చేశారు.  
 

మరిన్ని వార్తలు