వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఆ సేవలు..

5 Aug, 2019 14:38 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రైళ్లలోనూ విమానాల్లో మాదిరి ఎయిర్‌హోస్టెస్‌, స్టివార్డ్స్‌ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు భారతీయ రైల్వేలు సన్నాహాలు చేస్తున్నాయి. దేశంలో ప్రీమియం ట్రైన్‌గా నిలిచిన వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఈ మేరకు పైలట్‌ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టును పర్యవేక్షించే బాధ్యతను రైల్వే శాఖ ఐఆర్‌సీటీసీకి అప్పగించింది. వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఇప్పటికే ఎయిర్‌హోస్టెస్‌, స్టివార్డ్స్‌ సేవలు ప్రారంభమయ్యాయి.

ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే క్రమంలో ఐఆర్‌సీటీసీ 34 మంది సుశిక్షితులైన ఎయిర్‌హోస్టెస్‌, ఫ్లైట్‌ స్టివార్డ్‌లను వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఆరు నెలల పాటు పనిచేసేందుకు నియమించింది. ఈ సేవలు మంచి ఫలితాలను ఇస్తే మిగిలిన రైళ్లలోనూ ఈ తరహా సేవలను అందుబాటులోకి తీసుకువస్తారు. ఢిల్లీ -వారణాసి మధ్య ప్రయాణించే వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో రూ 25,000 వేతనంతో ఎయిర్‌హోస్టెస్‌, ఇతర సిబ్బందిని మెరుగైన సేవలు అందించేందుకు నియమించామని ఐఆర్‌సీటీసీ ప్రతినిధి సిద్ధార్ధ సింగ్‌ తెలిపారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కరోనా: ‘మర్కజ్‌, నిజాముద్దీన్‌ అని చెప్పొద్దు’

‘కోవిడ్‌ ప్రొటెక్షన్‌ రైళ్ల’లో..

ఇలా మాస్క్ త‌యారు చేయండి: స్మృతి ఇరానీ

హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానాలు..

కరోనా కాలం: చెట్టుపైనే మకాం!

సినిమా

బన్నీపై కేరళ సీఎం ప్రశంసల వర్షం

కరోనాపై పోరు.. సీసీసీకి బ్రహ్మానందం విరాళం

‘వాసు’ గుర్తున్నాడా? వచ్చి 18 ఏళ్లైంది!

పోలీసు బిడ్డగా వారికి సెల్యూట్‌ చేస్తున్నా: చిరు

దూరంగా ఉంటునే ఆశీర్వదించారు

కరోనా పోరు: మరోసారి అక్షయ్‌ భారీ విరాళం