ఫ్లిప్ కార్ట్ సీఈవో ఇంటి ఖరీదు 32 కోట్లు!

23 Jun, 2016 20:30 IST|Sakshi
ఫ్లిప్ కార్ట్ సీఈవో ఇంటి ఖరీదు 32 కోట్లు!

బెంగళూరు నగరంలో ఇటీవల అతిపెద్ద నివాస ఒప్పందం జరిగింది. పదివేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఓ గృహాన్ని  32 కోట్ల రూపాయలతో కొనేందుకు ఫ్లిప్ కార్ట్ సీఈవో బిన్నీ బన్సాల్ ముందుకొచ్చారు. నగరంలోని ఫ్లిప్ కార్ట్ కార్యాలయానికి అతి దగ్గరలో ఉన్న ఆ ఇంటిని కొనేందుకు ఆయన భారీగా రుణం తీసుకున్నట్లు నివేదికలు చెప్తున్నాయి.

ఐటీ కంపెనీలకు నెలవు, ఇండియాలోనే సుందర నగరంగా పేరొందిన బెంగళూరులో నివాస గృహాలకూ భారీ డిమాండ్ పెరిగిపోయినట్లు తాజా నివేదికలు చెప్తున్నాయి. నగరంలో ఫ్లిప్ కార్ట్ సీఈవో బిన్నీ బన్సాల్ ఇటీవల అతిపెద్ద నివాస గృహాన్ని కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. 10,000 అడుగుల విస్తీర్ణంలో ఉన్న నివాస గృహాన్ని బిన్నీ బన్సాల్ సుమారు 32 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు నివేదికలు వెల్లడించాయి. ఆ నివాసం స్థానిక ఫ్లిప్ కార్ట్ కార్యాలయానికి అతి సమీపంలోనే ఉన్నట్లు రిపోర్టుల ద్వారా తెలుస్తోంది.

నందన్ నీలేకని, క్రిస్ గోపాలకృష్ణన్, రాజీవ్ చంద్రశేఖర్ నివాసాలు బిన్నీ ఇంటికి పొరుగున ఉన్నాయని, బిన్నీ ఆ ఇంటిని కొనేందుకు భారీగానే రుణం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు