స్టాలిన్‌ అతిథిగృహంలో సోదాలు 

15 May, 2019 04:24 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు ఎన్నికల ప్రచార నిమిత్తం డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ బస చేయనున్న ప్రైవేటు అతిథిగృహంలో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. తమిళనాడులో 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు జరుగుతుండగా, వాటిల్లో ఒకటైన ఒట్టబిడారంలో ప్రచారంకోసం ఉదయం స్టాలిన్‌ అక్కడికి చేరుకోవాలి. తెల్లవారుజాము 5 గంటలకు అతిథిగృహంలోకి ప్రవేశించిన ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు తనిఖీలు ప్రారంభించారు. స్టాలిన్‌ ప్రచార వాహనం, బందోబస్తుగా అనుసరించే పైలట్, బ్లాక్‌ కమాండోస్, అనుచరుల వాహనాలను సోదా చేశారు. అక్కడి కార్యకర్తల వాహనాలనూ తనిఖీ చేశారు.  

23 తర్వాతే ఫ్రంట్‌పై స్పష్టత: స్టాలిన్‌ 
ఈనెల 23వ తేదీ ఓట్ల లెక్కింపు తర్వాత మాత్రమే మూడో ఫ్రంట్‌పై స్పష్టత వస్తుందని స్టాలిన్‌ మీడియాతో చెప్పారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ మూడో ఫ్రంట్‌ ఏర్పాటు నిమిత్తం రాలేదని, తమిళనాడులో ఆలయాల సందర్శనకు వచ్చి మర్యాదపూర్వకంగా మాత్రమే తనను కలిశారని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీయేతర ఫ్రంట్‌ ఏర్పాటు అసాధ్యమని అన్నారు.

మరిన్ని వార్తలు