ప్రముఖ జానపద గాయకురాలు మునియమ్మ ఇకలేరు

29 Mar, 2020 11:17 IST|Sakshi

సాక్షి, చెన్నై : ప్రముఖ జానపద గాయకురాలు, తమిళ నటి పరవై మునియమ్మ(83) ఇక లేరు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మునియమ్మ.. ఆదివారం మదురైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.2003లో విక్రమ్ నటించిన 'దూళ్' చిత్రంతో నటిగా పరిచయమయ్యారు మునియమ్మ. ఈ చిత్రలో ‘సింగం పోల’  అనే పాటతో ప్రాచుర్యం పొందారు. ఆ తర్వాత అనేక సినిమాల్లో తన గాత్రాన్ని వినిపించారు. దూళ్‌ సినిమాతో పాటు తోరనై కోవిల్‌, మాన్‌ కరాటే, వీరమ్‌ తదితర తమిళ చిత్రాల్లో నటించారు. అలాగే పలు టెలివిజ్‌ షోలు కూడా చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న మునియమ్మకు గతంలో దివంగత ముఖ్యమంత్రి జయలలిత రూ.6 లక్షలు అందజేశారు. ఆ మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్‌ చేసి ప్రతి నెల ఆరు వేల రూపాయలను భృతిగా అందజేస్తున్నారు. మునియమ్మ భర్త గతంలోనే మృతి చెందారు. ఈమెకు నలుగురు కుమారులు, ముగ్గరు కుమార్తెలు ఉన్నారు. మునియమ్మ అంత్యక్రియలు మధురైలో ఆదివారం సాయంత్రం జరగనున్నాయి.

మరిన్ని వార్తలు