కరోనాతో ఆహార సంక్షోభం 

2 Apr, 2020 07:19 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కోకపోతే ప్రపంచ ప్రజలకు ఆహార కొరత ప్రమాదం పొంచివున్నదని మూడు అంతర్జాతీయ సంస్థల అధిపతులు ఒక ప్రకటనలో హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనాని అడ్డుకునేందుకు లాక్‌డౌన్‌ని ప్రకటించిన నేపథ్యంలో అంతర్జాతీయ వాణిజ్యం, ఆహారసరఫరా తగ్గుముఖం పట్టింది. లాక్‌డౌన్‌ కారణంగా భవిష్యత్తులో ఆహార కొరత ఏర్పడుతుందనే భయంతో అనేక దేశాల్లోని ప్రజలు ముందుగానే సరుకులను కొనిపెట్టుకోవడంతో సూపర్‌ మార్కెట్లు తదితర షాపుల్లో వస్తువుల సరఫరా నిలిచిపోయింది. ఆహార లభ్యతపై ఏర్పడుతోన్న సందిగ్ధత అంతర్జాతీయ ఎగుమతులపై ఆంక్షలకు కారణమౌతోంది, ఇది ప్రపంచ మార్కెట్‌లో ఆహార కొరతకు దారితీస్తోందని ఐక్యరాజ్యసమితికి చెందిన ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ అధిపతి క్యూ డొంగ్యూ హెచ్చరించారు.  (‘తబ్లిగి జమాత్‌’తో పెరిగిన కేసులు )

>
మరిన్ని వార్తలు