ఈనెల నుంచి దేశమంతా ఆహార భద్రత

4 Nov, 2016 10:30 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆహార భద్రత చట్టం కింద దేశంలోని 80 కోట్ల మందికి బియ్యం, గోధుమలను సబ్సిడీపై అందించడానికి ఏటా రూ. 1.4 లక్షల కోట్లను ఖర్చు చేయనున్నట్లు కేంద్ర ఆహార శాఖ మంత్రి రాంవిలాస్‌ పాశ్వాన్‌ తెలిపారు. 2013లో ఆమోదం పొందిన ఈ చట్టాన్ని కేరళ, తమిళనాడు మినహా దేశమంతటా ఈనెల నుంచే అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు.

ఈ పథకం కింద ప్రతీ మనిషికి బియ్యం, గోధుమలను 5 కేజీల చొప్పున అందించనున్నారు. బియ్యం కేజీ రూ. 3, గోధుమలు కేజీ రూ. 2కు ఇవ్వాలని నిర్ణయించారు.

మరిన్ని వార్తలు