ఆహార భద్రతపై అంతర్జాతీయ ఒప్పందం

29 Nov, 2014 03:15 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశ ఆహార భద్రత అవసరాలకు అనుగుణంగా ప్రపంచ వాణిజ్య సంస్కరణల ఒప్పందానికి ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో) అంగీకారం తెలపడంలో భారత్ విజయం సాధించిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పైగా ఎలాంటి షరతులు, రాయితీలు లేకుండానే ఈ ఒప్పందం కుదిరిందని నొక్కి చెప్పింది. ఈ మేరకు జెనీవాలో గురువారం రాత్రి చరిత్రాత్మక ఒప్పందం జరిగిందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం లోక్‌సభకు తెలిపా రు. దీనిప్రకారం రైతులకు కనీస మద్దతు ధర ప్రకటించే విధానాన్ని ఇకపైనా భారత్ కొనసాగించవచ్చని, దీనికి డబ్ల్యూటీవో ఆమోదం తెలిపిందన్నారు.
 

మరిన్ని వార్తలు