కొండచిలువతో సెల్ఫీ దిగబోయి ప్రాణాలమీదకు..

18 Jun, 2018 16:53 IST|Sakshi

సాక్షి, కోల్‌కతా : పులిని దూరం నుంచి చూడాలనుకుంటే చూస్కో.. లేదు పులితో ఫోటో దిగాలనుకుంటే దిగు కానీ.. నాతో మాత్రం దిగేందుకు ట్రై చేయోద్దని కొండచిలువ ఒకటి ఓ అటవిశాఖ అధికారికి ఘాటుగా వార్నింగ్ ఇచ్చింది. 18 అడుగుల పొడవు, 40 కేజీల బరువున్న భారీ కొండచిలువ నుంచి ఓ ఫారెస్ట్‌ ఆఫీసర్‌ అదృష్టవశాత్తూ కొద్దిలో పెద్ద ప్రమాదం తప్పించుకున్నాడు. అతనికి భూమ్మీద ఇంకా నూకలున్నాయి.

వివరాల్లోకి వెళితే.. ఆదివారం సాయంకాలం కోల్‌కతాకు 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న జల్పాయిగురి గ్రామంలోకి ఓ కొండచిలువ ప్రవేశించింది. ఈ విషయాన్ని గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు తెలిపారు. దీంతో సంజయ్‌ దత్త అనే అటవీ అధికారి అక్కడికి చేరుకొని స్థానికుల సహాయంతో కొండచిలువను తన మెడలో వేసుకున్నారు. అంతటితో ఆగకుండా సంజయ్‌ దానితో పాటు గ్రామస్తులు సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో పైథాన్‌ సంజయ్‌ మెడను చుట్టే ప్రయత్నం చేసింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు దానిని లాగి పట్టుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. పిచ్చి పీక్ స్టేజీకి వెళ్లడమంటే ఇదేనేమో మరీ..

మరిన్ని వార్తలు