బీజేపీలోకి స్వామిప్రసాద్ మౌర్య..!?

8 Aug, 2016 12:18 IST|Sakshi
బీజేపీలోకి స్వామిప్రసాద్ మౌర్య..!?

లక్నోః ఇటీవల పార్టీకి  రాజీనామాచేసిన బహుజన సమాజ్ వాద్ పార్టీ మాజీ నాయకుడు, పడ్రౌనా ఎమ్మెల్యే  స్వామిప్రసాద్ మౌర్య  భారతీయ జనతా పార్టీ (బీజేపీ) లో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. పార్టీలోని తన మద్దతుదారులు సహా కొంతమంది మాజీ పార్టీ నాయకులతోపాటు ఆయన ఢిల్లీలో బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.

బహుజన సమాజ్ పార్టీ మాజీ జనరల్ సెక్రెటరీ స్వామిప్రసాద్ మౌర్య.. జూన్ 22న మాయావతి పార్టీకి రాజీనామా చేశారు.  మాయావతి పార్టీ టికెట్లను వేలం వేస్తున్నారని, దళితులను మోసం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విపక్ష నేత అయిన స్వామి ప్రసాద్ మౌర్య.. 2017 ఎన్నికలు పార్టీకి అత్యంత కీలకమైనవని, పార్టీ విజయంకోసం మంచి అభ్యర్థులను ఎంపిక చేయకుండా.. డబ్బు ఎక్కువగా ఇచ్చినవారికి మాయావతి పార్టీ టికెట్లు వేలం వేస్తున్నారంటూ విమర్శించారు. ప్రస్తుతం మౌర్య.. తన మద్దతుదారులతోపాటు ఢిల్లీవెళ్ళి  బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. అదే విషయాన్ని ఓ సీనియర్ బీజేపీ నాయకుడు కూడా సమర్థించినట్లు తెలుస్తోంది.

శివ్ పూర్ ఎమ్మెల్యే ఉడియాలాల్ సహా కొందరు మాజీ బీఎస్పీ నాయకులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు మౌర్య బీజేపీలో చేరేందుకు ఢిల్లీ పయనమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీజీపే ఫుల్పూర్ ఎంపీ కేశవ్ ప్రసాద్ మౌర్యను స్టేట్ పార్టీ ప్రెసిడెంట్ గా ఏర్పాటు చేసిన బీజేపీకి.. స్వామి ప్రసాద్ చేరికతో  ఉత్తర ప్రదేశ్ లో అన్నివిధాలుగా కలసివచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.

మరిన్ని వార్తలు