కేంద్ర కేబినెట్‌ మాజీ కార్యదర్శి ‘టీఎస్‌ఆర్‌’ కన్నుమూత

27 Feb, 2018 02:52 IST|Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్‌ మాజీ కార్యదర్శి టీఎస్‌ఆర్‌ సుబ్రమణియన్‌(79) సోమవారం కన్నుమూశారు. కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్న ఆయన స్వగృహంలోనే తుదిశ్వాస విడిచారని అధికార వర్గాలు తెలిపాయి.

తమిళనాడుకు చెందిన సుబ్రమణియన్‌ 1961 ఉత్తరప్రదేశ్‌ క్యాడర్‌ ఐఏఎస్‌ అధికారి. ప్రధానమంత్రులు వాజ్‌పేయి, గుజ్రాల్,  దేవెగౌడ హయాంలో 1996 నుంచి 1998 వరకు సుబ్రమణియన్‌ క్యాబినెట్‌ కార్యదర్శిగా పనిచేసి, పదవీ విరమణ పొందారు. ప్రభుత్వ పాలన, దేశ రాజకీయాలపై ఆయన మూడు పుస్తకాలు రాశారు. కాగా, టీఎస్‌ఆర్‌ మృతిపై ప్రధాని మోదీ సంతాపం వ్యక్తంచేశారు.

మరిన్ని వార్తలు