షీలాకు కష్టాలు

16 Jun, 2016 20:51 IST|Sakshi
షీలాకు కష్టాలు

న్యూఢిల్లీ: మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత షీలా దీక్షిత్ కష్టాలు ఎదురవనున్నాయి. ఆమె అతి త్వరలో ఏసీబీ దర్యాప్తును ఎదుర్కోనున్నారు. ట్యాంకర్ స్కాంకు సంబంధించి ఆమెపై ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చిన ఫిర్యాదును లెప్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ అవినీతి కేసుల విచారణ సంస్థ ఏసీబీకి పంపించారు. ఈ కేసుపై విచారణ చేయాల్సిందిగా ఆయన ఆదేశించారు.

దీంతో ఆమెపై విచారణ ప్రారంభంకానుంది. 2012లో ఢిల్లీ ప్రభుత్వం ఆధ్వర్యంలో మొత్తం 385 ట్యాంకర్లను అద్దెకు తీసుకుంది. అయితే, ఈ వ్యవహారంలో భారీ అవినీతి చోటుచేసుకుందని, ఈ కార్యక్రమానికి అధ్యక్షురాలిగా ఉన్న నాటి ఢిల్లీ సీఎం షీలా దీక్షిత్ భారీ మొత్తంలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ఒక కమిటీని వేసి ఆమెపై దర్యాప్తు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గవర్నర్ కు నాడు ఫిర్యాదు చేయగా ఆయన ఇప్పుడు స్పందించాడు.  
 

మరిన్ని వార్తలు