ఆర్టీఐ కార్యకర్త హత్య కేసులో మాజీ ఎంపీకి జీవితఖైదు

12 Jul, 2019 03:34 IST|Sakshi
దిను సోలంకి

అహ్మదాబాద్‌: ఆర్టీఐ కార్యకర్త అమిత్‌ జెత్వా హత్య కేసులో బీజేపీ మాజీ ఎంపీతోపాటు ఆరుమందికి సీబీఐ ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధించింది. గిర్‌ అరణ్య ప్రాంతంలో అక్రమ మైనింగ్‌ వ్యవహారాలను పిల్‌ ద్వారా వెలుగులోకి తేవడంతో  జెత్వాను 2010లో నాటి జునాగఢ్‌ ఎంపీ దిను సోలంకి హత్య చేశారు. ఈ అక్రమ మైనింగ్‌లో సోలంకి ఉన్నాడని జెత్వా తన పిల్‌లో పేర్కొనడమే ఈ హత్యకు కారణం. దోషులు సోలంకి, అతడి మేనల్లుడు శివలకు జీవిత ఖైదుతోపాటు రూ. 15 లక్షల చొప్పున జరిమానా విధిస్తూ సీబీఐ జడ్జి కేఎం దేవ్‌ గురువారం తీర్పునిచ్చారు.

వీరితోపాటు శైలేష్‌ పాండ్య, బహదూర్‌సిన్హ్‌ వాధెర్, పంచన్‌ దేశాయ్, సంజయ్‌ చౌహాన్, ఉడాజి ఠాకూర్‌లకు జీవిత ఖైదు విధించింది. 2010లో ఓ వైపు జెత్వా దాఖలు చేసిన పిల్‌పై వాదనలు జరుగుతుండగానే గుజరాత్‌ హైకోర్టు ప్రాంగణంలో అమిత్‌ జెత్వా దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్య కేసును విచారించిన అహ్మదాబాద్‌ పోలీసులు బీజేపీ ఎంపీ దిను సోలంకికి క్లీన్‌చిట్‌ ఇచ్చారు. సంతృప్తి చెందని మృతుడు అమిత్‌ జెత్వా తండ్రి భిఖాభాయ్‌ జెత్వా కేసును సీబీఐకి అప్పగించాలంటూ కోర్టును కోరారు. కోర్టు అందుకు అంగీకరించడంతో సీబీఐ విచారణ చేపట్టి తీర్పు వెలువరించింది. కేసును పరిష్కరించడానికి న్యాయవ్యవస్థ ఎక్కువ సమయం తీసుకున్నప్పటికీ, తమ కుటుంబానికి న్యాయం అందిందని తీర్పు అనంతరం భిఖాభాయ్‌ పేర్కొన్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నాడు చంద్రుడి యాత్ర విఫలమైతే..

మద్యం ఆపై గన్స్‌తో డ్యాన్స్‌ : ఎమ్మెల్యేపై వేటు

ఫ్రెండ్స్‌తో పార్టీ.. రూ. 5 వేల కోసం..

ఆస్తి వివాదం : 9 మంది మృతి

సూర్య వ్యాఖ్యలను సమర్థించిన కమల్‌

అది అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది : అమిత్‌ షా

50 శాతం సీట్లు ఇస్తేనే పొత్తు..

మూక హత్యలపై కేంద్రం రియాక్షన్‌ ఇదే..

ఒట్టేసి చెబుతున్నాం.. మీకు అన్నీ ఫ్రీ!

నడిరోడ్డుపై అంకుల్‌ బిత్తిరి చర్య

ఒక్క ప్రేమ కోసమే సాక్షి మిశ్రా పారిపోలేదు!

కర్ణాటక రాజకీయాలపై కాంగ్రెస్‌ ఆసక్తికర ట్వీట్‌

ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకలాపాలపై ఆరా తీయండి

సంకీర్ణ ప్రభుత్వానికి ఇక కష్టమే!

భారత్‌కు దావూద్‌ కీలక అనుచరుడు!

కన్నడ సంక్షోభంపై సుప్రీం కీలక తీర్పు

నగ్నంగా ఉంటే నయమవుతుంది!

తప్పతాగి.. పోలీసుపై మహిళ వీరంగం!

కులాంతర వివాహమా? మొబైల్‌ వాడుతున్నారా?

వరద బీభత్సం.. 50 మంది మృతి..!

ప్రధాని లక్ష్యంగా దాడికి కుట్ర!

టీనేజ్‌ అమ్మాయి మొబైల్‌ వాడితే జరిమానా..!

అనారోగ్యం అతడి పాలిట వరమైంది

ప్రాంతీయ భాషల్లో మళ్లీ ‘పోస్ట్‌మెన్‌’ పరీక్ష

కోడలికి కొత్త జీవితం

ఎంపీలకు ఢిల్లీ తెలుగు అకాడమీ సన్మానం

మంత్రుల డుమ్మాపై మోదీ ఫైర్‌

జాధవ్‌ కేసుపై ఐసీజే తీర్పు నేడే 

కర్నాటకంపై నేడే సుప్రీం తీర్పు 

పాక్‌ మీదుగా రయ్‌రయ్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హైకోర్టులో ‘బిగ్‌బాస్‌’ కి ఊరట

‘చెట్ల వెంట తిరుగుతూ డాన్స్‌ చేయలేను’

కండలవీరుడికి కబీర్‌ సింగ్‌ షాక్‌

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

తమన్నా ప్లేస్‌లో అవికానా!

‘పూరి ముఖంలో సక్సెస్‌ కనిపించింది’