క‌రోనా : మాజీ ఆరోగ్య‌శాఖ మంత్రి మృతి

7 Jul, 2020 15:05 IST|Sakshi

ప‌నాజి : క‌రోనా కార‌ణంగా గోవా మాజీ ఆరోగ్య‌శాఖ మంత్రి సురేష్ అమోంక‌ర్ (68) సోమ‌వారం క‌న్నుమూశారు. జూన్ చివ‌రి వారంలోనే ఆయ‌న‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ కావ‌డంతో మార్మోవాలోని ఈఎస్ఐ ఆసుపత్రికి తరలించారు.  అయితే అప్ప‌టికే ఆయ‌న ఆరోగ్యం క్షీణించ‌డంతో చికిత్స పొందుతూ క‌న్నుమూశారు.  ఈ విష‌యాన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విశ్వ‌జిత్ రాణె దృవీక‌రించారు. కాగా  గోవాలోని పాలీ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి 1999లో సురేష్ అమోంక‌ర్ ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. త‌ర్వాత  మనోహర్ పారికర్ ప్రభుత్వంలో ఆరోగ్య, సాంఘీక సంక్షేమ, కార్మిక ఉపాధి శాఖల మంత్రిగా పనిచేశారు. త‌ద‌నంత‌రం 2007, 2012 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. సురేష్ అమోన్‌కర్ మృతి పట్ల ముఖ్య‌మంత్రి ప్ర‌మోద్ సావంత్, ఆరోగ్య శాఖ మంత్రి విశ్వ‌జిత్ రాణె స‌హా ప‌లువురు ప్ర‌ముఖులు సంతాపం తెలిపారు. (ఒక వ్య‌క్తి నుంచి 104 మందికి సోకిన క‌రోనా )

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు