నా భార్య‌కు క‌రోనా సోకింది : రతన్ శుక్లా

13 Jul, 2020 15:30 IST|Sakshi

కోల్‌క‌తా :  త‌న భార్య‌కు క‌రోనా సోకింద‌ని భార‌త మాజీ ఆల్ రౌండ‌ర్, మంత్రి లక్ష్మీ రతన్ శుక్లా వెల్ల‌డించారు. గ‌త కొన్ని రోజులుగా త‌న భార్య స్మిత సన్యాల్ శుక్లాకు జులుబు, జ్వ‌రం లాంటి ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు తేలింద‌ని ర‌త‌న్ శుక్లా పేర్కొన్నారు. దీంతో మిగ‌తా కుటుంబ‌స‌భ్యులంద‌రూ క్వారంటైన్‌లో ఉన్నామ‌ని చెప్పారు.  స్మిత శుక్లా ప్ర‌స్తుతం హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట‌లో డిప్యూటీ సెక్రటరీగా పని చేస్తున్నారు. 

ర‌త‌న్ శుక్లా 1999లో క్రికెట‌ర్‌గా అరంగేట్రం చేసిన  47 ఐపీఎల్ మ్యాచ్లు  ఆడి సత్తా నిరూపించుకున్నారు. డిల్లీ డేర్‌డెవిల్స్,  సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన శుక్తా ప్ర‌స్తుతం బెంగాల్ స్పోర్ట్స్ మినిస్ట‌ర్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు. ఇక బెంగాల్‌లో కోవిడ్ కేసుల సంఖ్య 26 వేలు దాట‌గా మ‌ర‌ణించిన వారి సంఖ్య 854కు చేరింది. కేసులు పెరుగుతున్నందున కంటైన్‌మైంట్ జోన్ల‌లో ప్ర‌భుత్వం లాక్‌డౌన్ విధించిన సంగ‌తి తెలిసిందే. (కర్ణాటక మంత్రికి కరోనా పాజిటివ్‌ )


 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు