మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అంతులే మృతి

2 Dec, 2014 11:56 IST|Sakshi

ముంబై: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఏఆర్ అంతులే(85) మంగళవారం మృతి చెందారు. గత కొంత కాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నఅంతులే బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందారు. అంతులేను ఐసీయూ వార్డులో ఉంచి వైద్యం అందించినా పరిస్థితి విషమించి మృతిచెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. 

 

బుధవారం రాయ గఢ్ లోని ఆయన సొంత గ్రామం అంబెట్ లో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు మేనల్లుడు ముస్తాక్ అంతులే తెలిపారు.1980 జూన్ 9వ తేదీన మహారాష్ట్ర ఎనిమిదో సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆయన రెండేళ్లు కూడా పదవిలో కొనసాగలేదు. ఇందిరా ప్రిస్థాన్ ట్రస్టు ద్వారా  అంతులే అవినీతికి పాల్పడినట్లు హైకోర్టు నిర్దారించడంతో 1982 జనవరి 13న ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

మరిన్ని వార్తలు