నలుగురు మావోయిస్టుల లొంగుబాటు

15 Nov, 2016 03:26 IST|Sakshi
నలుగురు మావోయిస్టుల లొంగుబాటు

సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో సోమవారం నలుగురు మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. దళ సభ్యులైన నీలగుణి పద్మనాభ, భారతీ దంపతులతో పాటు రాజు, రిజ్వాన్‌బేగం అలియాస్ కల్పన దంపతులు మంగళూరు కలెక్టర్ సత్యవతి, ఎస్పీ అణ్ణామలై, పంచాయతీ సీఈవో రాగప్రియ సమక్షంలో లొంగిపోయారు. నీలగుణి పద్మనాభపై అయుధాల అక్రమ రవాణా, భౌతిక దాడులు, పేలుడు పదార్థాల వినియోగం తదితర విషయాలకు సంబంధించి 19 కేసులు, రిజ్వాన్‌బేగంపై రెండు కేసులు ఉన్నారుు.

భారతి, రాజులపై కేసులు నమోదు కాకపోరుునా మావోయిస్టు కార్యకలాపాల్లో పాలుపంచుకునేవారు. పద్మనాభపై రూ.5 లక్షలు, భారతి, రిజ్వాన్ బేగంపై రూ.లక్ష రివార్డులు ఉండేవి. వీరు న్యాయక్కాగినావు సంస్థ సభ్యులైన గౌరి శంకర్, ఏకే సుబ్బయ్య తదితరుల చొరవ వల్ల లొంగిపోయారు. ఈ నలుగురూ కొన్నేళ్లుగా బెంగళూరులోనే ఉంటూ చిన్నచిన్న పనులు చేసుకుని జీవనం కొనసాగించేవారని సమాచారం.

>
మరిన్ని వార్తలు