కశ్మీర్‌లో నలుగురు ఉగ్రవాదుల హతం

17 Jun, 2016 03:18 IST|Sakshi

* చొరబాటు యత్నం భగ్నం
* ఎన్‌కౌంటర్‌లో జవాను మృతి

శ్రీనగర్: కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా సరిహద్దు రేఖ సమీపంలోని తంగ్‌ధార్ సెక్టార్‌లో గురువారం మిలిటెంట్లు భారత్‌లోకి చొరబడేందుకు యత్నించగా సైనికులు భగ్నం చేశారు. ఈ ఆపరేషన్‌లో నలుగురు మిలిటెంట్లు హతం కాగా, ఒక జవాను కూడా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. మిలిటెంట్ల అక్రమ చొరబాటు యత్నాన్ని భగ్నం చేయడం గత మూడు రోజుల్లో ఇది రెండోసారి.

మంగళవారం కుప్వారా జిల్లా  మాచిల్ సెక్టార్‌లో ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు యత్నించగా జవాన్లు భగ్నం చేశారు. రెండు రోజుల పాటు సాగిన ఈ ఆపరేషన్‌లో ఒక మిలిటెంట్ హతం కాగా, ఒక జవాను కూడా ప్రాణాలు కోల్పోయాడు. మరో నలుగురు సైనికులు గాయపడ్డారు.

మరిన్ని వార్తలు