కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌ : నలుగురు ఉగ్రవాదులు మృతి

22 Apr, 2020 14:27 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్‌లోని షోపియన్‌ జిల్లాలో బుధవారం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు మరణించారు. మెల్హోర ప్రాంతంలోని జైనపోరా గ్రామంలో ఉగ్రవాదులు తలదాచుకున్నారనే సమాచారంతో భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఉగ్ర మూక కాల్పులు జరపడటంతో భద్రతా దళాలు జరిపిన ఎదురు కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మరణించారు.

ఘటనా స్ధలంలో పెద్దసంఖ్యలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయని జమ్ము కశ్మీర్‌ పోలీస్‌ ఐజీపీ విజయ్‌ కుమార్‌ వెల్లడించారు. మరణించిన ఉగ్రవాదులు అన్సార్‌ గజవతుల్‌ హింద్‌కు చెందిన వారిగా భావిస్తున్నామని, వీరిలో ఒకరు సీనియర్‌ కమాండర్‌ అని అధికారులు పేర్కొన్నారు. ఉగ్రవాదులను జమ్ము కశ్మీర్‌ పోలీసులు, 55 రాష్ర్టీయ రైఫిల్స్‌, సీఆర్‌పీఎఫ్‌లతో కూడిన సంయుక్త బృందం చుట్టుముట్టగా ఉగ్రవాదులు వారిపై కాల్పులకు దిగారని ప్రతిగా భద్రతా దళాల కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మరణించారని అధికారులు తెలిపారు.

చదవండి : ఎన్‌కౌంటర్‌లో నలుగురు తీవ్రవాదుల హతం

>
మరిన్ని వార్తలు