'ఆ మ్యాచ్ చూస్తే అర్థమవుతుంది'

20 Mar, 2016 13:53 IST|Sakshi
'ఆ మ్యాచ్ చూస్తే అర్థమవుతుంది'

న్యూ ఢిల్లీ: భారత రాజ్యాంగం అసమ్మతిని వ్యక్తపరచడానికి పూర్తి స్వేచ్ఛనిస్తుంది. కానీ, దేశ విధ్వంసాన్ని అనుమతించదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. నమ్మకాలు, మార్గాలకు జాతీయ భావజాలం దిశానిర్ధేశం చేస్తుందని తెలిపారు. భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు మేము పూర్తిగా మద్దతు తెలుపుతున్నామని పునరుద్ఘాటించారు. రెండు రోజుల బీజీపీ జాతీయ కార్యవర్గ సమావేశం అనంతరం జైట్లీ మీడియాతో మాట్లాడారు.  
 
'భారత్ మాతా కీ జై' స్లోగన్ విషయంలో ఎలాంటి చర్చ అవసరం లేదన్నారు. భారత్ మాతాకీ జై స్లోగన్ విషయంలో భారతీయులకు ఎలాంటి ఇబ్బందులుండవన్నారు. శనివారం ఈడెన్ గార్డెన్లో జరిగిన పాకిస్తాన్, భారత్ మ్యాచ్ చూస్తే ఈ విషయం అర్థమవుతుందన్నారు.

>
మరిన్ని వార్తలు