మొబైల్ గేమ్‌: యువ‌కుడి వేలిని నోట‌క‌రిచిన క‌ప్ప‌

27 May, 2020 15:53 IST|Sakshi

న్యూఢిల్లీ: మొబైల్ గేమ్స్ మ‌న‌మేనా.. జంతువులు కూడా ఆడేస్తున్నాయి. గేమ్‌లో ఓడిపోతే మ‌నం లైట్ తీస్కుంటామేమో కానీ అవి నేరుగా మ‌న‌సుకు తీసుకుంటాయి. ఎందుకో ఈ స్టోరీ చ‌దివేసేయండి. చీమ‌లు, పురుగులు స్క్రీన్ మీద ప‌రిగెడుతుంటే మ‌నం వేలితో ట‌చ్ చేసి చంపేయాలి. ఇది 'యాంట్ స్మాష‌ర్‌' గేమ్‌.. అయితే ఈ ఆట‌ను క‌ప్ప‌తో ఆడించాడో మ‌హానుభావుడు. అది మ‌న‌లాగా వేలితో కాకుండా నాలుక‌తో ఆటాడింది. చీమ క‌నిపించ‌గానే ల‌టుక్కున మింగేద్దామ‌నుకుంది. దాని నాలుక స్క్రీన్ మీదకు ఆడించ‌గానే చీమ చ‌చ్చిపోతుంది, కానీ నోటికి అంద‌డం లేదు. దీంతో అది మ‌రింత తీక్ష‌ణంగా ఆడ‌టం మొద‌లు పెట్టింది. (ఈ కప్ప నిజంగా లక్కీఫెలో)

ఈసారి వ‌చ్చేదాన్ని వ‌దిలిపెట్ట‌నంత క‌సిగా ఆట‌లో లీన‌మైపోయింది. అలా చీమ‌ల్ని చంపుతూ ఉండ‌గా గేమ్ ముగిసింది. దీంతో అక్క‌డున్న వ్య‌క్తి స్క్రీన్‌పై వేలు ఆనించ‌గా అది వెంట‌నే అత‌డి వేలును నోట క‌రుచుకుంది. ఇది పాత వీడియోనే అయిన‌ప్ప‌టికీ అట‌వీశాఖ అధికారి సుశాంత్ నందా తిరిగి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో మ‌రోసారి వైర‌ల్‌గా మారింది. "లాస్ట్‌లో మాత్రం ట్విస్ట్ అదిరింది" అంటూ నెటిజ‌న్లు ఛ‌లోక్తులు విసురుతున్నారు. "జంతువుల వేట క‌న్నా వాటితో ఆటే ప్ర‌మాదక‌రం" అంటూ ఓ నెటిజ‌న్‌ కామెంట్ చేశాడు. (కార్వార కప్ప గోవాలో కూర)

మరిన్ని వార్తలు