వ్యవ‘సాయా’నికి అంత తక్కువ నిధులా?

25 Apr, 2015 00:52 IST|Sakshi

న్యూఢిల్లీ: వ్యవసాయ రంగానికి అతి తక్కువ నిధులు కేటాయించడాన్ని వ్యవసాయ రంగంపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ కమిటీ తీవ్రంగా తప్పుబట్టింది. వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలకు ఊతమిచ్చేందుకు నిధుల కేటాయింపులను భారీగా పెంచాలని పార్లమెంటుకు అందించిన నివేదికలో సూచించింది. వ్యవసాయాధారిత ఆర్థిక వ్యవస్థ కలిగిన భారత్‌లో 60%పైగా జనాభా సాగుపై ఆధారపడిన సమాజంలో వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అరకొర నిధులందించడాన్ని ఆక్షేపించింది.
 
 ఇతర రంగాలతో పోలుస్తూ తాజా బడ్జెట్‌లో వ్యవసాయ కేటాయింపులను వివరించింది. కాగా, ప్రకృతి ప్రకోపానికి బలైన రైతాంగ దుస్థితిపై పార్లమెంట్లో పార్టీలకతీతంగా సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. దెబ్బతిన్న రైతులకు సాయం అందించడాన్ని, రుణమాఫీ ప్రక్రియను వేగవంతం చేయాలని విపక్ష సభ్యులు లోక్‌సభలో కోరారు.  ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఇవ్వాలని బీజేపీ సభ్యుడు బాబూలాల్ చౌధరి, రూ. 250 కోట్లతో నిధి ఏర్పాటు చేయాలని దుష్యంత్‌చౌతాలా(ఐఎన్‌ఎల్‌డీ) డిమాండ్ చేశారు.

>
మరిన్ని వార్తలు