నన్ పై గ్యాంగ్ రేప్

14 Mar, 2015 15:59 IST|Sakshi
నన్ పై గ్యాంగ్ రేప్

కోల్ కత్తా: కోల్ కత్తాలోని నాడియా జిల్లా లోని గంగ్నాపూర్ లో  72 సం.రాల  నన్ పై  సామూహిక  అత్యాచారం కలకలం సృష్టించింది. పోలీసుల సమాచారం ప్రకారం గత అర్థరాత్రి తరువాత  స్కూల్ లోకి చొరబడ్డ సుమారు  పన్నెండుమంది దొంగలు నన్ పై  సామూహిక అత్యాచారం చేసి, లాకర్ లోని 12 లక్షల రూపాయలను  దోచుకెళ్లారు. విషయం తెలుసుకున్న స్కూలు సిబ్బంది ఆమెను స్థానిక హాస్పిటల్ కు తరలించారు.  ఈవార్త దావానలంలో వ్యాపించడంతో ఆగ్రహించిన  విద్యార్థులు ఆందోళనకు దిగారు.  స్థానికంగా రోడ్డు, రైలు మార్గాలను దిగ్బంధనం చేశారు.   ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది.  ముఖ్యమంత్రి మమతా   బెనర్జీ  ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు.  

 

జిల్లా మేజిస్ట్రేట్  పీడీ సలీం, పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.   రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పార్థా చటర్జీ ఈ సంఘటనను తీవ్రంగా ఖండించారు.  దోషులను  కఠినంగా శిక్షిస్తామన్నారు. మానవత్వానికి మచ్చ తెచ్చే ఘటనగా ఆయన అభివర్ణించారు.  పూర్తి వివరాలను ఇంకా తెలియాల్సి ఉందని నేరస్తులను తక్షణమే అదుపులోకి తీసుకుని తగినవిధంగా  శిక్షిస్తామని  రాష్ట్ర  గ్రామీణాభివృద్ధి  శాఖామంత్రి  ఫిరాద్ హామీ  ఇచ్చారు.  
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు