మహిళా కానిస్టేబుల్పై ఖాకీల అఘాయిత్యం

6 Oct, 2015 10:44 IST|Sakshi
మహిళా కానిస్టేబుల్పై ఖాకీల అఘాయిత్యం

లక్నో: సామాన్య మహిళలకే కాదు... మహిళా పోలీసులకు రక్షణ లేకుండా పోతోంది. అది కూడా పోలీసుల చేతిలో అత్యాచారానికి గురైన సంఘటన స్థానికంగా కలకలం రేపింది.  మహిళా కానిస్టేబుల్ను బెదిరించి, అనంతరం మత్తుమందు ఇచ్చిన ఇద్దరు ఖాకీలు,  డ్రైవర్ కలిసి  సాక్షాత్తూ పోలీస్ వాహనంలోనే అఘాయిత్యానికి పాల్పడ్డారు.
.
వివరాల్లోకి వెళితే  యూనిఫాంలో ఉన్న ఇద్దరు ఖాకీలు, మరోవ్యక్తి తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఉత్తరప్రదేశ్ ఇటావాలోని ఝాన్సీకి చెందిన మహిళా  కానిస్టేబుల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్థానిక మేళా సందర్భంగా విధుల్లో పాల్గొని తిరిగి  తన తోటి  మహిళా కానిస్టేబుల్తో కలిసి వెళుతుండగా,   ఖాకీ దుస్తుల్లో పోలీసులు తమను బెదిరించి పోలీసు వాహనంలో  ఎక్కించారని, మత్తు పదార్థం  కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చారని ఆరోపిస్తోంది.  అనంతరం తుపాకి గురి పెట్టి, చంపేస్తామంటూ అఘాయిత్యానికి పాల్పడి అనంతరం రోడ్డుపై విసిరేసి వెళ్లినట్లు తెలిపింది.

ప్రస్తుతం మహిళా కానిస్టేబుల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అయితే  హాస్పిటల్లో కూడా తన సోదరికి రక్షణ లేదనీ... తమకు భద్రత కల్పించాలని బాధితురాలి సోదరి విజ్ఞప్తి చేసింది.  అనాధలమయిన తమకు న్యాయం జరగాలని...  రక్షించాల్సిన పోలీసులే దాడికి పాల్పడితే ఎవరితో చెప్పుకోవాలంటూ  ఆందోళన వ్యక్తం చేసింది.

ఈ సంఘటనపై ఇటావా సీనియర్ పోలీస్ అధికారి మాంజీ సైని మాట్లాడుతూ ఈ సంఘటనపై  స్థానిక  మహిళా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామన్నారు. విచారణ చేపట్టినట్లు తెలిపారు. ఈ సంఘటతో షాక్కు గురైన ఆమె తిరిగి ఝాన్సీ వెళ్లడానికి భయపడుతోందన్నారు. కాగా ఈ దారుణానికి పాల్పడిన ఇద్దరిని బాధితురాలు గుర్తించినట్లు చెప్పారు. దుస్తులపై ఉన్న నేమ్  ప్లేట్స్ ద్వారా  అజయ్ యాదవ్, రాజ భాయ్గా. మరొకరు డ్రైవర్గా గుర్తించిందన్నారు.

మరిన్ని వార్తలు