వికాస్‌ దూబే అనుచరుడికి కరోనా పాజిటివ్

9 Jul, 2020 15:07 IST|Sakshi

ఫ‌రిదాబాద్ :  గ్యాంగ్‌స్ట‌ర్ వికాస్ దుబే అనుచ‌రుల్లో ఒక‌రికి క‌రోనా పాజిటివ్ అని తేలింది. మంగ‌ళ‌వారం దూబె ప్ర‌ధాన అనుచ‌రులు ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకోగా వీరిలో ప్ర‌భాత్ అనే వ్య‌క్తి ఎన్‌కౌంట‌ర్‌లో మృతిచెందాడు. మిగిలిన ఇద్ద‌రు అనుచ‌రుల్లో తండ్రీ కొడుకులైన అంకుర్, శ్ర‌వ‌ణ్‌లకు క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా  ఒక‌రికి వైర‌స్ ఉన్న‌ట్లు నిర్ధార‌ణ అయ్యింది. దీంతో  జైలులోని ఓ ప్ర‌త్యేక గ‌దిలో అత‌డ్ని ఉంచారు. ఇక వారం రోజులుగా త‌ప్పించుకు తిరుగుతున్న గ్యాంగ్‌స్ట‌ర్ వికాస్ దూబెను మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీలో పోలీసులు గురువారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విష‌యంపై వికాస్ దూబె త‌ల్లి స‌ర‌ళాదేవి స్పందించారు. ప్ర‌తీ సంవ‌త్స‌రం త‌న కుమారుడు ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని దర్శించుకుంటాడని, ఆ అమ్మ‌వారే వికాస్‌ను ర‌క్షంచింద‌ని పేర్కొన్నారు. ప్ర‌భుత్వానికి ఏది మంచి అనిపిస్తే అది చేస్తుందని త‌గిన శిక్ష వేస్తుంద‌ని తెలిపింది.  (ఉజ్జ‌యినిలో గ్యాంగ్‌స్ట‌ర్ వికాస్ దూబే అరెస్ట్‌ )

కానీ ఇంత‌కుముందు పోలీసుల‌పై కాల్పుల‌కు పాల్ప‌డ్డ తన కుమారుడు వికాస్ దూబె చ‌ర్య‌ను త‌ప్పుప‌ట్టిన ఆమె అత‌డు ఎక్క‌డ క‌నిపించినా ఎన్‌కౌంట‌ర్ చేసి చంపాల‌ని మీడియాతో మాట్లాడ‌టం గ‌మ‌నార్హం. కాన్పూర్ స‌మీపంలోని బిక్రూ గ్రామంలో 8మంది పోలీసుల‌ను బ‌లి తీసుకున్న ఘ‌ట‌న‌లో వికాస్ దూబె ప్ర‌ధాన నిందుతుడిగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే అత‌ని అనుచ‌రుల‌ను అదుపులోకి తీసుకున్నారు. వారిలో ముగ్గురు ప్ర‌ధాన అనుచ‌రులు పోలీసుల ఎన్‌కౌంట‌ర్‌లో మ‌ర‌ణించారు. తాజాగా వికాస్ దూబెను కూడా ఎన్‌కౌంట‌ర్‌లో హ‌త‌మారుస్తార‌న్న వార్త‌ల నేప‌థ్యంలో పోలీసులు అదుపులోకి తీస‌కున్నారు. (వికాస్‌ దూబేపై నగదు బహుమతి 5 లక్షలకు పెంపు)


 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు