ఎంతటి వారైనా చర్యలు తప్పవు: గంభీర్‌

25 Feb, 2020 16:48 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లపై మాజీ క్రికెటర్‌, బీజేపీ ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం జరుగుతున్న హింసాత్మక ఘటనలకు బీజేపీ నేత కపిల్‌ మిశ్రా కారణమని ఆరోపణలు వినిపిస్తున్న తరుణంలో.. హింసను ప్రేరేపించేలా ప్రవర్తించిన వారు ఎంతటి వారైనా చర్యలు తప్పవని గంభీర్‌ స్పష్టం చేశారు. రెచ్చగొట్టే ప్రసంగం చేసినవారు తమ పార్టీకి చెందినవారైనా మరెవరైనా సరే కఠిన చర్యలు తప్పవని తేల్చిచెప్పారు.

ఇందులో ఎవరికీ ఎటువంటి సందేహాలకు స్థానం లేదంటూ స్పష్టతనిచ్చారు. ఒకవేళ తమ పార్టీకి చెందిన కపిల్‌ మిశ్రా ప్రమేయం ఇందులో ఉంటే అతనిపై కూడా చర్యలు ఉంటాయన్నారు. ఈశాన్య ఢిల్లీలోని జాఫ్రాబాద్, మౌజ్‌పూర్‌ తదితర ప్రాంతాల్లో పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూలంగా కొందరు, వ్యతిరేకంగా కొందరు చేసిన నిరసన.. ఉద్రిక్తతకు దారితీసిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఏడుగురు చనిపోగా.. అందులో హెడ్ కానిస్టేబుల్ కూడా ఉన్నారు. చదవండి: అమిత్‌ షా సానుకూలంగా స్పందించారు : కేజ్రీవాల్‌

‘వెనక్కి వెళ్లిపో లేదంటే.. కాల్చిపడేస్తా!’

మరిన్ని వార్తలు