ఫొటోలతో ప్రచారం ఇష్టం లేదు: గంభీర్‌

5 May, 2020 15:38 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్, ఎంపీ గౌతం గంభీర్ ఈ సమయాన్ని తన కుటుంబంతో గడుపుతున్నారు. అదే విధంగా ఢిల్లీ తూర్పు లోక్‌సభ నియోజకవర్గంలో కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొవడానికి తన ఫౌండేషన్‌ ద్వారా పలు సహాయ కార్యక్రమాలను చేపడుతున్నారు. ఈ క్రమంలో ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గౌతమ్‌ గంభీర్‌ పలు విషయాలను పంచుకున్నారు. 

ప్రశ్న: లాక్‌డౌన్‌ సమయాన్ని ఎలా ఉయెగించుకుంటున్నారు? 
గంభీర్: నా పిల్లలతో సరదాగా ఆడుకోవటానికి ఈ సమయాన్ని కేటాయిస్తున్నాను. అదే విధంగా నిద్ర పోతున్నాను. లాక్‌డౌన్‌ను సానుకూలమైన దృష్టితో చూస్తున్నానని చెప్పారు.  

ప్రశ్న: ఇన్ని రోజులు ఇంట్లోనే ఉంటున్న మీరు బయట ఉన్న కరోనా పరిస్థితి గురించి మీ పిల్లలకు వివరించడానికి కష్టపడుతున్నారా?
గంభీర్: నా చిన్న కూతురు అనైజా ఏమీ అడగదు. కానీ పెద్ద కూతురు ఆజీన్ మాత్రం బయకు ఎందుకు వెళ్లటం లేదని అడుగుతోంది. అప్పుడు నేను బయట లాక్‌డౌన్‌ కొనసాగుతోందని చెబుతున్నాని తెలిపారు. ఆజీన్‌ తన స్నేహితులను, స్కూల్‌ను మిస్‌ అవుతోందని ‌ చెప్పారు. 

ప్రశ్న: ఈ సమయంలో మీరు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ ఉంటూ మీ విషయాలను పంచుకుంటున్నారా?
గంభీర్: నాకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను రహస్యంగానే ఉండాలని భావిస్తాను. నా పిల్లలకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను మాత్రం సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నానని ఆయన తెలిపారు. నా జీవితానికి సంబంధించిన వ్యక్తిగత విషయాను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయాడానికి పెద్దగా ఇష్టపడనని ఆయన చెప్పారు. చాలా మంది సోషల్ ‌మీడియాలో పలు విషయాలు పంచుకుంటారు. అది వారి వ్యక్తిగతమైన విషయంగా భావిస్తానని చెప్పుకొచ్చారు. 

Two cats in one house, how long can they go without pawing each other?? 😹😸😻

A post shared by Gautam Gambhir (@gautamgambhir55) on

ప్రశ్న: మీ ఫౌండేషన్‌ ద్వారా చేస్తున్న సహాయ కార్యక్రమాల గురించి తెలపండి?
గంభీర్: మా ఫౌండేషన్‌ ద్వారా పేదలకు రేషన్‌ బియ్యం, ఆహారం పంపిణీ చేస్తున్నాం. కానీ దాని సంబంధించిన ఫొటోలతో ప్రచారం చేసుకోవటం నాకు ఇష్టం ఉండదు. ఈ కార్యక్రమాలను మార్కెట్‌ చేసుకోవటం నాకు నచ్చదు. అందుకే ఫౌండేషన్ ద్వారా ఆహారం, బియ్యం పంపిణీ చేసే సంచుల మీద నా ఫొటో వేసుకోవడానికి నిరాకరించాను. కేవలం మా ఫౌండేషన్‌ పేరు మాత్రమే ముద్రించామని తెలిపారు. నాకు తోచిన మేరకు సాయం చేయాలనుకుంటాను. కానీ దాని గురించి జనాలు మాట్లాడుకుంటున్నారా? లేదా? అనేది అలోచించను అని ఆయన చెప్పారు. ఏమీ ఆశించకుండా సాయం చేసినప్పుడే సంతృప్తి ఉంటుందని తెలిపారు.
   

మరిన్ని వార్తలు