ఆశయ శిఖరానికి దక్కిన గౌరవం

15 Jan, 2018 20:27 IST|Sakshi
హెల్త్‌ వర్కర్‌ గీతా వర్మ

సిమ్లా : గీతా వర్మ ఓ సాధారణ మహిళ. తనే కాదు తన చుట్టూ ఉన్న వాళ్లందరూ బావుండాలనేది ఆమె ఆశయం. ఆశయాన్ని అందుకునేందుకు హెల్త్‌ వర్కర్‌గా మారారామే. గీతా సొంతవూరు హిమాచల్‌ ప్రదేశ్‌లోని సప్నాట్‌ అనే కుగ్రామం. తట్టు, రుబెల్లా టీకా(ఎమ్‌ఎమ్‌ఆర్‌ వ్యాక్సిన్‌)ను సప్నాట్‌, మండి నియోజకవర్గంలోని నొమడిక్‌ కమ్యూనిటి ప్రజలకు 100 శాతం అందేలా చూశారు గీత.

గీత సేవలను గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఆమెకు అరుదైన గౌరవాన్ని ఇచ్చింది. 2018 డబ్ల్యూహెచ్‌వో క్యాలెండర్‌ను గీత ఫొటోలతో ముద్రించింది. వ్యాక్సిన్‌ను అందించేందుకు గీతా చాలా కష్టించాల్సివచ్చేది. కొండప్రాంతం ​కావడంతో కొన్ని చోట్ల కాలినడకన వెళ్లి వ్యాక్సిన్‌ అందించేవారు గీత. రోడ్లు ఉన్న చోట్ల బైక్‌ వెనుక ఇనుప పెట్టెను పెట్టుకుని వెళ్లివచ్చేవారు.

గీత బైక్‌పై వ్యాక్సిన్‌ వేసి రావడానికి వెళ్లి వస్తున్న ఫొటోలు గతంలో సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. కాగా, డబ్ల్యూహెచ్‌వో గుర్తింపు రావడంపై హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్‌ గీతను ప్రశంసించారు.

మరిన్ని వార్తలు