జర్మనీ మొదటి స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్!

20 Jul, 2016 19:26 IST|Sakshi
జర్మనీ మొదటి స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్!

చెన్నైః ఒడిషాలోని భువనేశ్వర్, కేరళలోని కొచ్చి, తమిళనాడులోని కోయంబత్తూర్ లను స్మార్ట్ సిటీలుగా మార్చేందుకు సాయం అందిస్తామని గతంలో జర్మనీ హామీ ఇచ్చింది. అందులో భాగంగా ముందుగా తమ ప్రాజెక్టును కోయంబత్తూరు నుంచి ప్రారంభించేందుకు జర్మనీ సంసిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఇండియాకు వచ్చిన జర్మన్ అంబాసిడర్ మార్టిన్ నే.. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితతో సమావేశం అయ్యారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టును ముందుగా కోయంబత్తూర్ లో ప్రారంభించనున్నట్లు తెలిపారు.

భారత్ లో మూడు నగరాలను స్మార్ట్ సిటీలుగా మార్చేందుకు సాయం అందిస్తామని జర్మనీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదే నేపథ్యంలో ఇండియాకు వచ్చిన జర్మన్ అంబాసిడర్ మార్టిన్ నే తమిళనాడు ముఖ్యంత్రి జయలలితను స్టేట్ సెక్రెటేరియల్ లో కలిసినట్లు తమిళనాడు ప్రభుత్వం ఓ అధికారిక ప్రకటన ద్వారా తెలిపింది. స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు సహాయం అందించేందుకు సంసిద్ధంగా ఉన్న జర్మనీ.. ముందుగా కోయంబత్తూర్ నుంచి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనున్నట్లు జర్మన్ అంబాసిడర్ నే.. తెలిపారని వెల్లడించింది. ఈ నేపథ్యంలో వ్యాపారవేత్తల ప్రాతినిథ్యంతో కూడిన ఓ బృదం జూలై 20న కోయంబత్తూర్ సందర్శించి, కోయంబత్తూర్ నగర మేయర్, ఇతర అధికారులతో మిగిలిన చర్చలు జరపనున్నట్లు తెలిపింది.

ప్రాజెక్టులకు తమవంతు సహాయం అందించేందుకు ముందుకు వస్తున్నజర్మన్ ప్రభుత్వానికి ఈ సందర్భంగా  జయలలిత కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తమిళనాడులో బ్యాంకింగ్ గ్రూప్ కెఎఫ్ డబ్ల్యూ సహా.. మరిన్ని జర్మన్ కంపెనీలు పెట్టుబడులను పెట్టేందుకు ముందుకు రావాలని ఆమె కోరారు.

మరిన్ని వార్తలు