పోలవరం బిల్లుకు మద్దతు ఇవ్వండి: ఆజాద్

14 Jul, 2014 10:49 IST|Sakshi
పోలవరం బిల్లుకు మద్దతు ఇవ్వండి: ఆజాద్

ఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ సోమవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజ్యసభ సభ్యులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పోలవరం ముంపు మండలాల విలీనం బిల్లుపై చర్చ జరిపారు. పోలవరం ప్రాజెక్ట్కు కాంగ్రెస్ మాట ఇచ్చినందున  బిల్లుకు మద్దతు ఇవ్వాలని గులాం నబీ ఆజాద్ ....సభ్యులకు సూచించారు.

కాగా సోమవారం పోలవరం బిల్లు రాజ్యసభ ముందుకు రానుంది. బిజెపితో పోల్చుకుంటే రాజ్యసభలో కాంగ్రెస్‌కు బలం ఎక్కువగా ఉంది. దాంతో కాంగ్రెస్‌ సభ్యులు కనుక బిల్లుపై ఎదురు తిరిగితే ఆమోదముద్ర పడే అవకాశం లేదు. కాగా తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు పోలవరం బిల్లును వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.  బిల్లును అడ్డుకుంటామని ఇప్పటికే వారు వ్యాఖ్యానించినఈ నేపథ్యంలోపోలవరం  బిల్లును ఆమోదం తెలపాలని ఆజాద్...పార్టీ ఎంపీలను కోరారు.
 

మరిన్ని వార్తలు