జమ్మూకశ్మీర్‌కు నూతన లెఫ్టినెంట్‌ గవర్నర్‌

25 Oct, 2019 20:27 IST|Sakshi

గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ బదిలీ

లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా ఐఏఎస్‌ గిరీశ్‌ చంద్ర ముర్ము

శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ను బదిలీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నిర్ణయం తీసుకుంది. ఆయనను గోవా గవర్నర్‌గా పంపనుంది. ఇక జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా ఐఏఎస్‌ గిరీశ్‌ చంద్ర ముర్ముని నియమించింది. లఢక్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా రాధాకృష్ణ మాథూర్‌ని నియమించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. దాంతోపాటు మిజోరాం గవర్నర్‌గా పీఎస్‌ శ్రీధరన్‌ పిళ్లైను నియమించింది. ఇక జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన కేంద్రం రాష్ట్రాన్ని రెండుగా విభజించిన సంగతి తెలిసిందే. జమ్మూకశ్మీర్‌, లఢఖ్‌ కేంద్రపాలిత ప్రాంతాలుగా రాష్ట్రం విడిపోయింది. జమ్ముకశ్మీర్‌కు అసెంబ్లీ ఉండగా..  లడఖ్‌లో చట్టసభ  ఉండదు. ఈ రెండు కేంద్రపాలిత ప్రాంతాలు అక్టోబర్‌ 31 నుంచి మనుగడలోకి వస్తాయి.
(చదవండి : జమ్మూ కశ్మీర్‌.. 81 బ్లాకుల్లో బీజేపీ విజయం)

ఐఏఎస్‌ గిరీశ్‌ చంద్ర ముర్ము..
1985 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ గిరీశ్‌ చంద్ర ముర్ము ప్రధాని మోదీకి అత్యంత నమ్మకస్తుడు. మోదీ గుజరాత్‌ సీఎంగా ఉన్న సమయంలో గిరీశ్‌ ముఖ్యమంత్రి ప్రిన్సిపల్‌ సెక్రటీరీగా పనిచేశారు. గిరీశ్‌ ప్రస్తుతం కేంద్ర ఆర్థికశాఖలో వ్యయ నిర్వహణ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా