ఆ బాలిక ధైర్యానికి అందరూ ఫిదా..

16 Feb, 2018 09:56 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: ప్రమాదం సంభవించే ముందు ఏమి చేయాలో అర్థం కాదు. కొంతమంది అయితే ప్రమాదం వచ్చినప్పుడు తమ వారిని వదిలి పారిపోయేవాళ్లు కూడా ఉంటారు. కానీ తన  బుజ్జి తమ్ముడిని కాపాడుకునేందుకు ఎనిమిది సంవత్సరాల బాలిక తన వయసుకు మించిన సాహసం చేసింది. మృత్యువు ఆవు రూపంలో వచ్చింది. దారిపొడవునా అందర్ని పొడుచుకుంటూ వస్తున్న ఆవు ఒక్కసారిగా అడుకుంటున్న చిన్నారుల వైపు దూసుకొచ్చింది.

వివరాలివి.. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఆర్తి తన చిట్టి తమ్ముడు కార్తీక్‌ని చిన్న కారులో కూర్చోబెట్టుకుని ఇంటి ఆవరణలో ఆడిస్తోంది. ఆ సమయంలో అటువైపుగా పరుగెత్తుకు వచ్చిన ఆవు వారివైపు మళ్లింది. దాంతో తమ్ముడిని తన చేతులతో పక్కకు లాగేసుకుంది. కానీ ఆవు మాత్రం వాళ్లను వదలకుండా కొమ్ములతో కుమ్ముతున్నా ఆ చిన్నారి తన శరీరాన్ని అడ్డంగా పెట్టి తన  బుజ్జి తమ్ముడిని రక్షించేందుకు ప్రయత్నించింది. ఆవు మాత్రం అలానే ఆర్తిని రెండు, మూడు సార్లు పొడిచింది. ఫిబ్రవరి 13న ఈ ఘటన చోటుచేసుకుంది.

ఆ సమయంలో ఇంట్లో నుంచి ఓ వ్యక్తి వచ్చి ఆవును అక్కడి నుంచి తరిమేశాడు. ఆ బాలికకు మాత్రం చిన్నపాటి గాయాలయ్యాయి. సీసీటీవిలో రికార్డు అయినా ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. చిన్నారి ధైర్య సాహసాలను అందరూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు