ఆ రేప్‌ కేసులో తండ్రీకొడుకులు నిర్దోషులు

8 Dec, 2019 04:12 IST|Sakshi

ఢిల్లీ కోర్టు తీర్పు

న్యూఢిల్లీ: రాజధాని ఢిల్లీలో నాలుగేళ్ల క్రితం జరిగిన ఒక అత్యాచారం కేసులో ఓ తండ్రి, కొడుకులను నిర్దోషులుగా ప్రకటించిన సంఘటన ఆసక్తిని రేకెత్తిస్తోంది. బాధితురాలు నిందితుల కూతురు, సోదరి కావడం గమనార్హం. వివరాలు.. ఇలా ఉన్నాయి. సుమారు 10 మంది కుటుంబ సభ్యులతో ఒకే గది ఉన్న ఇంట్లో బాధితురాలు నివాసం ఉంటోంది. ఇందులోనే ఓ చిన్న కిరాణా కొట్టు కూడా నడుపుతున్నారు. 2015 ప్రాంతంలో తనకు 17 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తన తండ్రి, సోదరుడు కొన్ని నెలలపాటు అత్యాచారం చేశారని, విషయం ఇతరులకు చెబితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ అంశంపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ ఆలస్యంగా దాఖలు చేయడం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం.

ఈ కేసులో విచారణ చేపట్టిన ఢిల్లీ అదనపు సెషన్స్‌ కోర్టు మూడు కారణాలను చూపి ఫిర్యాదు చేసిన యువతి తండ్రి, సోదరుడిని నిర్దోషులుగా విడిచిపెట్టింది. ఎఫ్‌ఐఆర్‌ ఆలస్యంగా దాఖలు కావడం ఒక కారణమైతే, కుటుంబ సభ్యుల సమక్షంలో అత్యాచారం జరగడం అసంభవమని కోర్టు అంచనాకు రెండో కారణం. విచారణ సమయంలో బాధితురాలు వేర్వేరు తేదీలు, నెలల పేర్లు చెప్పిందని, పైగా ఇతర కుటుంబ సభ్యులెవరూ బాధితురాలి పక్షాన విచారణలో పాల్గొనకపోవడాన్ని బట్టి కూడా ఆ యువతి చెప్పేది నిజం కాకపోవచ్చునని కోర్టు భావించింది. ఆ యువతి అప్పుడప్పుడూ కిరాణా కొట్లో వ్యాపారం చేసేదని, తనను బయట ఎక్కడకూ పంపేవారు కాదన్న బాధితురాలి వాంగ్మూలానికి ఇది భిన్నమని కోర్టు చెప్పింది. కొనుగోళ్ల కోసం వచ్చిన వాళ్ల (ఎక్కువగా ఇరుగుపొరుగు కావచ్చు)కు చెప్పుకున్నా ఎవరో ఒకరు సాయపడి ఉండేవారని కోర్టు పేర్కొంది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బీజేపీ అధినాయకత్వంపై ఏక్‌నాథ్‌ ఖడ్సే కినుక

ఎంపీల విదేశీ పర్యటనలపై చట్టం తేవాలి

పీఎస్‌ఎల్‌వీ సీ– 48 ప్రయోగానికి సర్వం సిద్ధం

సాయుధ బలగాల సంక్షేమానికి తోడ్పడండి

టీచర్‌పై సామూహిక అత్యాచారం

జార్ఖండ్‌లో 63.36% పోలింగ్‌

తక్షణ న్యాయం ఉండదు!

అపరకాళిగా మారి హతమార్చింది

ట్రేడింగ్‌లో అవకతవకలు.. ఐటీ దాడులు

ఆమె పోరాటం ముగిసింది!

అది బూటకపు ఎన్‌కౌంటర్‌

‘నువ్వు పిసినారివి రా’..

ఈనాటి ముఖ్యాంశాలు

ఉన్నావ్‌: రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా

దారుణం: రెండు సార్లు గ్యాంగ్‌రేప్‌

అత్యాచారాలకు రాజధానిగా భారత్‌: రాహుల్‌

ఉన్నావ్‌: వారిని కాల్చి చంపడమే సరైన శిక్ష

దేశంలో ‘రేప్‌’లను ఆపేదెలా?

ఎన్‌కౌంటర్‌; సీజే కీలక వ్యాఖ్యలు

ఉన్నావ్‌: యోగి సర్కారుపై మాయావతి ఫైర్‌

ఉన్నావ్ ఎఫెక్ట్‌: సొంత కుమార్తెపై పెట్రోల్‌ పోసి..

జార్ఖండ్‌ రెండోదశ పోలింగ్‌.. ఒకరి మృతి

పోలీసులే ‘జడ్జీలు’ అయితే.....

'రేపిస్టులను రక్షించండి, అత్యాచారాలను పెంచండి'

మహిళలపై దాడులు: కేంద్రం కీలక ఆదేశాలు

వివాదాస్పద బిల్లుపై తృణమూల్‌ ఎంపీలకు విప్‌ జారీ

ఉన్నావ్‌ బాధితురాలి మృతి: వెల్లువెత్తిన నిరసనలు

అమ్మో భూతం..!

భార్యను చంపిన భర్తపై లుకౌట్‌ నోటీసులు జారీ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఖుషీ ఖుషీ స్టెప్స్‌

డేట్‌ ఫిక్స్‌

అపజయం మంచికే!

శుక్రవారం మూడు మ్యాచ్‌లు గెలిచాయి

అతి నిద్ర అనారోగ్యం

సేఫ్‌ జానర్‌లో వెళ్లాలనుకోను