ఆవుకు జాతీయ జంతువు హోదా!

11 May, 2017 00:54 IST|Sakshi
ఆవుకు జాతీయ జంతువు హోదా!

తాము మద్దతిస్తామన్న జమైత్‌ ఉలేమా–ఐ–హింద్‌ అధ్యక్షుడు
న్యూఢిల్లీ: ఆవుకు జాతీయ జంతు వు హోదా ఇవ్వడంపై ఆలోచన చేయాలని జమైత్‌ ఉలేమా–ఐ– హింద్‌ అధ్యక్షుడు మౌలానా సయ్యద్‌ అర్షద్‌ మదాని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ఈ ప్రతిపాదనకు తాము మద్దతిస్తామని ప్రకటిం చారు. దేశంలోని ఇస్లామిక్‌ మేధావులకు ప్రాతినిధ్యం వహిస్తున్న అత్యంత ప్రభావవం తమైన సంస్థకు అధిపతి అయిన ఆయన బుధవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడు తూ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంత రించుకున్నాయి.

గోసంరక్షకుల పేరిట కొనసాగుతున్న హింస నేపథ్యంలో ‘భయపూరిత వాతావ రణం’ నెలకొనడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మతాన్ని అడ్డుపెట్టుకుని గోసంరక్షకులు దాడులకు, హత్యలకు పాల్పడుతున్నారని, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారని చెప్పారు. హిందువుల మతవిశ్వాసాల్ని తాము గౌరవిస్తామని, అయితే ఏ ఒక్కరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునేందుకు అనుమతించరాదని అన్నారు.

మరిన్ని వార్తలు