6 నెలల గడువు ఇవ్వండి

7 Dec, 2016 01:26 IST|Sakshi
6 నెలల గడువు ఇవ్వండి

పాతనోట్లపై కేంద్రాన్ని కోరిన ప్రవాసులు
 
 వాషింగ్టన్: రద్దయిన పెద్దనోట్లను డిపాజిట్ చేయడానికి గడువు ఆరు నెలలు పొడిగించాలని కేంద్రాన్ని భారత సంతతి ప్రజల సంస్థ జీఓపీఐఓ (ది గ్లోబల్ ఆర్గనైజేషన్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఇండియా-ఆరిజిన్) కోరింది. పాత రూ.500, 1000 నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం సాహసోపేత చర్య అని వర్ణించింది. ఇందుకు తమ మద్దతు ఉంటుందని తెలిపింది. ఈ మేరకు  ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి సంస్థ ఈ మధ్య రాసిన లేఖలో... ప్రవాసులు, పీఐఓల నుంచి తనకు చాలా ఫిర్యాదులు అందాయని పేర్కొంది. భవిష్యత్‌లో భారత పర్యటనకు ఉపయోగపడతాయని చాలా మంది ప్రవాసులు పాత నోట్లను తమ వద్ద అట్టిపెట్టుకున్నారని లేఖలో జీఓపీఐఓ అధ్యక్షుడు నీరజ్ బక్షి అన్నారు.  

 డిపాజిట్ చేస్తేనే సరిపోదు...
 ముంబై: నల్లధనం బ్యాంకులో డిపాజిట్ చేసినంత మాత్రాన అది సక్రమమైన ధనంగా మారిపోదని రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా చెప్పారు. చెల్లించాల్సిన పన్ను చెల్లించేంత వరకూ దానిని నల్లధనంగానే పరిగణిస్తారన్నారు. ముంబైలో జరుగుతున్న బ్రిక్స్ దేశాల రెవెన్యూ ముఖ్యాధికారుల సమావేశానికి హాజరైన సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

మరిన్ని వార్తలు