ఉగ్ర కోరల్లో పశ్చిమ తీరం

7 Apr, 2018 09:29 IST|Sakshi

పనాజి, గోవా : దేశంలోని పశ్చిమ తీర ప్రాంతాల్లో ఉగ్ర దాడి జరిగే అవకాశం ఉందనే సమాచారంతో గోవా ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. తీర ప్రాంతాల్లోని పోర్టులను కూడా ఈ మేరకు అప్రమత్తం చేసినట్లు ఓడరేవుల శాఖ మంత్రి జయేష్‌ సల్గాంకర్‌ తెలిపారు. గతంలో స్వాధీనం చేసుకున్న ఓ భారతీయ బోటును పాకిస్తాన్‌ విడుదల చేయబోతోంది.

ఈ సందర్భంగా ఉగ్రదాడి జరగొచ్చని ఇంటిలిజెన్స్‌ ప్రభుత్వాలను హెచ్చరించింది. దీంతో అప్రమత్తమైన ఆయా రాష్ట్రాలు తీర ప్రాంతాల్లో గస్తీని పెంచాయి. గోవాతో పాటు, గుజరాత్‌, ముంబై తీరాలకు కూడా దేశ విద్రోహ శక్తుల నుంచి ప్రమాదం పొంచి ఉన్నట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాల హెచ్చరికలు అందాయి.

తీరప్రాంతంలోని  స్పోర్ట్స్‌ ఆపరేటర్స్‌, కాసినో నిర్వాహకులు కూడా జాగ్రత్తగా ఉండాలని ఓడరేవుల శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కరాచీ నుంచి బయల్దేరిన ఓ ఫిషింగ్‌ బోటులో ఉగ్రవాదులు భారత్‌కు చేరుకునే అవకాశం ఉందని నేవీ అధికారి జేమ్స్‌ బ్రగాంజా ధ్రువీకరించారు.

మరిన్ని వార్తలు