ఎయిమ్స్‌ నుంచి గోవా సీఎం డిశ్చార్జి

14 Oct, 2018 15:15 IST|Sakshi
గోవా సీఎం​ మనోహర్‌ పారికర్‌ (ఫైల్‌ ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ : పాంక్రియాటిక్‌ క్యాన్సర్‌తో గత నెల రోజుల నుంచి ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌  ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. పారికర్‌ ఆరోగ్య పరిస్థితి ఆదివారం ఉదయం విషమించగా ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ (ఐసీయూ)కు తరలించి ఆ తర్వాత ఐసీయూ నుంచి వార్డుకు అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశామని ఎయిమ్స్‌ అధికారి ఒకరు వెల్లడించారు. ఆదివారం రాత్రికి ఆయన గోవా చేరుకుంటారని పారికర్‌ సన్నిహితులు తెలిపారు.

గత ఏడు నెలలుగా పారికర్‌ గోవా, ముంబై, న్యూయార్క్‌, న్యూఢిల్లీలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. కాగా ఎయిమ్స్‌లోనే శుక్రవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కేబినెట్‌ మంత్రులతో సమావేశమయ్యారు. మరోవైపు దీర్ఘకాలంగా అస్వస్ధతతో బాధపడుతున్న పారికర్‌ సీఎం పదవి నుంచి వైదొలగాలని విపక్ష కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తోంది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు